Sunday, June 14, 2026
HomeTrending Newsప్లాంట్ ప్రారంభానికి రండి: సిఎంకు ఏటీసీ ఆహ్వానం

ప్లాంట్ ప్రారంభానికి రండి: సిఎంకు ఏటీసీ ఆహ్వానం

ATC Tyre: ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆగస్ట్ లో తమ కంపెనీ ప్రారంభోత్సవానికి రావాలని సిఎంను ఆహ్వానించారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రేవేట్‌ లిమిటెడ్ ఏర్పాటు చేసిన నూతన ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో ఉత్పత్తికి రెడీ అవుతోంది.

ఏటీసీ – ది యోకోహామా రబ్బర్‌ కో. లిమిటెడ్, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్ధ, ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్‌ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఆరు ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

ఏటీసీ భారతదేశంలో ఇప్పటికి రెండు తయారీ ప్లాంట్లను నెలకొల్పింది. ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్‌ (గుజరాత్‌), మూడో ప్లాంట్ వైజాగ్ సమీపంలోని అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ఏర్పాటు చేసింది. ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతో ఉత్పత్తి మొదలవుతోంది. 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.  అచ్యుతాపురం ప్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్‌సీ సెగ్మెంట్‌), పెద్ద బయాస్‌ టైర్లు (అగ్రి, కాన్స్‌), రేడియల్‌ టైర్లు (అగ్రి), రేడియల్‌ (ఓటీఆర్‌), బయాస్‌ టైర్, ఓటీఆర్‌ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్‌ టైర్లు ఉత్పత్తి చేయనుంది.

ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో  రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ ప్రహ్లద్‌ రెడ్డి, అంబరీష్‌ ఆర్‌ షిండే, పీఆర్‌ హెడ్‌ వైవీ. కృష్ణంరాజు, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Also Read : ఏపీఎల్ లోగో ఆవిష్కరించిన సిఎం జగన్   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular