Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్త్రో బాల్ కెప్టెన్ కు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం

త్రో బాల్ కెప్టెన్ కు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం

Encourage: త్రోబాల్ భారత జట్టు కెప్టెన్ చావలి సునీల్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. సునీల్ ప్రతిభను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ లు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళారు.  2012 సంవత్సరం నుండి భారత జట్టు త్రో బాల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న చావలి సునీల్ తన ఆట తీరుతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు.

మంత్రి రోజా తన కార్యాలయంలో ఈ చెక్కును సునీల్ కు అందజేశారు. ఎంపీ సురేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రతిభ వున్న క్రీడాకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular