చైనా కంపెనీలు.. పాకిస్తాన్ ప్రభుత్వం మీద బలోచ్ ప్రజల అసంతృప్తి హింసాత్మక రూపు దాలుస్తోంది. కరాచీ యూనివర్సిటీలో దాడి కొత్త కోణానికి తెరలేపింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో కేవలం పురుషులే పాల్గొనగా ఇటీవల కరాచీ విశ్వవిద్యాలయంలో జరిగిన దాడిలో మొదటిసారిగా ఓ మహిళా ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఉగ్రవాద కార్య కలాపాలతో ఏ మాత్రం సంబంధం లేని ఓ ఉన్నత విద్యావంతురాలు ఫిదాయిగా మారటం సంచలనం రేపుతోంది. ఎంఈడి, జంతుశాస్త్రంలో పిజి, ఫిలాసఫీ లో ఎంఫిల్ చేసిన షారి బలోచ్ దాడికి ముందు సోషల్ మీడియాలో కూడా విజయ దరహాసంతో కూడిన ఫోటోలు పోస్టు చేయటం చర్చనీయంశంగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన చివరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షరీ బలోచ్ భర్త డెంటల్ డాక్టర్ కాగా ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన షరి బలోచ్ కొద్ది రోజుల నుంచి బలోచ్ లిబరేషన్ మూవ్మెంట్ కు మద్దతుగా సెమినార్ లు నిర్వహిస్తున్నారు.
పాక్ సైనికులు, చైనా పౌరులే లక్ష్యంగా దాడులు జరగటం… ఆ కంపెనీల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిఫలిస్తోంది. ఈ ఏడాది వివిధ రకాల దాడుల్లో 24 మంది చైనా పౌరులు చనిపోయారు. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. చైనా కంపెనీలు స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా వనరులు దోచుకొంటున్నాయని… పాకిస్తాన్ ప్రభుత్వం చైనా కంపెనీలకు వత్తాసు పలుకుతోందని బలోచ్ ప్రజల్లో అసంతృప్తిగా ఉంది. గ్వదర్ ఓడరేవు వద్ద బందోబస్తు లేకుండా చైనా కంపనీలు రోజువారి పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇమ్రాన్ హయం నుంచి నేటి షాబాజ్ షరీఫ్ ఫరకు చైనా కంపెనీలకే దన్నుగా ఉంటున్నారు. బలోచిస్తాన్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలు పట్టించుకోని పాక్ ప్రభుత్వాలు అనుమానితుల పేరిట అనేకమంది యువకుల్ని, మేధావులను హతమారుస్తున్నాయి. విద్యా, వైద్యం అనేవి బలోచ్ ప్రజలకు ఎండమావిగా మారాయి.
Also Read : బలోచిస్తాన్ మిలిటెంట్లతో పాకిస్తాన్ కు తిప్పలే