Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Kind Heart: ఆసీస్ క్రికెట్ టీమ్ ఔదార్యం

Kind Heart: ఆసీస్ క్రికెట్ టీమ్ ఔదార్యం

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన సిరీస్ సందర్భంగా తాము గెల్చుకున్న ప్రైజ్ మనీ మొత్తాన్ని క్రికెట్ మ్యాచ్ ల్లో సేవలందించే సహాయక చిన్నారులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఆరోన్ పించ్, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు మూడు 20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు జూన్, జులై నెలల్లో శ్రీలంకలో పర్యటించింది. టి-20 సిరీస్ ను ఆసీస్ గెల్చుకోగా, వన్డే సిరీస్ లంక గెల్చుకుంది. టెస్ట్ సిరీస్ డ్రా అయ్యింది.

ఆసీస్ టీమ్ లంకలో ఉన్న సమయంలోనే  ఆ దేశంలో తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రజలు నాటి అధ్యక్షుడు గోటబాయ రాజపక్షే నివాసంపై దాడులు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళననలతో పాటు ప్రజలు నిత్యావసరాలు అందక  ఇబ్బందులు పడుతున్న ఉదంతాలను ఆసీస్ క్రికెటర్లు స్వయంగా వీక్షించారు. లీటర్ పెట్రోల్ కోసం కిలోమీటర్ల పాటు ప్రజలు క్యూల్లో నిల్చోవడం కూడా వారి హృదయాలను ద్రవింపజేసిది. అందుకే ప్రైజ్ మనీగా వచ్చిన 45 వేల డాలర్లు యునిసెఫ్ ద్వారా లంకకు అందించేందుకు టీమ్ అంగీకరించింది.

 అక్కడి వాస్తవ  పరిస్థితులను కళ్ళారా చూశామని, అందుకే మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ నిర్ణయానికి వచ్చామని టెస్ట్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ చెప్పారు. తాము పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు తమకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారని, ఎంతో ఆదరించారని, వారు కష్టాల్లో ఉండి కూడా తమపై ఎంతో  ఆప్యాయత చూపారని, ఇది తమ మనసుకు హత్తుకుందని ఆరోన్ పించ్ వ్యాఖ్యానించాడు.

గత ఏడాది కోవిడ్ రెండో దశ లో  ఇండియా తీవ్రంగా ప్రభావితం అయినప్పుడు కూడా ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు ఇలాగే తమ ఔదార్యం ప్రదర్శించారు. క్రికెట్ ఆస్ట్రేలియా దాదాపు 50 వేల డాలర్ల ఖర్చుతో ఆక్సిజన్ పరికరాలు అందించింది.

తాజాగా ఆసీస్ జట్టు ప్రదర్శించిన ఈ సౌహార్ద్రం నిజంగా అభినందనీయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్