Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్The Ashes: ఇంగ్లాండ్ ఎదురీత

The Ashes: ఇంగ్లాండ్ ఎదురీత

లార్డ్స్ టెస్ట్ లోనూ ఇంగ్లాండ్ ఎదురీదుతోంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు  నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 114 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు రెండు వికెట్లకు 130 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నేడు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా- 77; స్టీవెన్ స్మిత్-34 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 4; జోస్ టంగ్ 2; అండర్సన్, బెన్ స్ట్రోక్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 45 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది జాక్ క్రాలే-౩ , ఓలీ హోప్-3; హ్యారీ బ్రూక్ 4; జో రూట్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో బెన్ డకెట్- బెన్ స్టోక్స్ లు ఐదో వికెట్ కు అజేయంగా 69 పరుగులు జోడించారు. డకెట్-50; స్టోక్స్-29 పరుగులతో క్రీజులో ఉన్నారు
ఆసీస్ బౌలర్లో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 257 పరుగులు అవసరం కాగా ఆరు వికెట్ల చేతిలో ఉన్నాయి

 చివరి రోజు తొలి సెషన్ లో  ఆస్ట్రేలియా బౌలర్లు  రాణిస్తే ఈ టెస్ట్ లోను విజయం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular