యాషెస్ సిరీస్ లో మూడో టెస్ట్ ఆసక్తిగా మారింది. ఆస్ట్రేలియా 251 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్ట పోకుండా 27 పరుగులు చేసింది.
నేడు మూడోరోజు వర్షం కారణంగా తొలి రెండు సెషన్ల ఆట సాగలేదు. టీ విరామం తర్వాత ఆట కొనసాగింది. నిన్న 18 పరుగులతో క్రీజులో ఉన్న ట్రావిస్ హెడ్ 77 పరుగులు చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ -28; స్టార్క్-16; మర్ఫీ-11 పరుగులు చేశారు. 224 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువార్ట్ బ్రాడ్, క్రిస్ ఓక్స్ చెరో 3; మార్క్ వుడ్, మోయిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ పూర్తయిన తరువాత ఆసీస్ 250 రన్స్ ఆధిక్యంలో ఉంది.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ ఐదు ఓవర్లు మాత్రమే ఆడి 27 పరుగులు చేసింది. జాక్ క్రాలే-9; బెన్ డకెట్-18 రన్స్ తో క్రీజులో ఉన్నారు.
విజయానికి ఇంకా 224 పరుగులు కావాల్సి ఉండగా రెండ్రోజుల ఆట మిగిలి ఉంది.