Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Canada Open: ఫైనల్లో సేన్, సెమీస్ లో సింధు ఓటమి

Canada Open: ఫైనల్లో సేన్, సెమీస్ లో సింధు ఓటమి

కెనడా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ లో భారత షట్లర్ లక్ష్య సేన్ టైటిల్ రేసులో నిలిచాడు. నేడు జరిగిన సెమీ ఫైనల్లో జపాన్ ఆటగాడు కేంటా నిశిమోటో పై 21-17; 21-14 తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టాడు.

కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్ లో పివి సింధు ఓటమి పాలైంది. జపాన్ ప్లేయర్ అకానే యమగుచి 21-14; 21-15 తేడాతో సింధుపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది.

గత ఏడాది కామన్ వెల్త్ గేమ్స్ లో వ్యక్తిగత విభాగంలో మెన్స్ సింగల్స్ టైటిల్ గెల్చుకున్న సేన్ ఆ తర్వాత ఏ టైటిల్ నేగ్గలేకపోయాడు.

నేడు జరిగే ఫైనల్స్ లో చైనా ప్లేయర్ లి షి ఫెంగ్ తో సేన్ తలపడనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్