Ravindra Jadeja: భారత స్పిన్నర్ల మాయాజాలానికి ఆసీస్ చేతులెత్తేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ నాగపూర్ లో నేడు ఆరంభమైంది. చాలా గ్యాప్ తరువాత జట్టులోకి వచ్చిన జడేజా తన స్పిన్ పవర్ మరోసారి తెలియజెప్పి ఐదు వికెట్లతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లతో సత్తా చాటి టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని దాటాడు.
ఆసీస్ జట్టులో లబుషేన్-49; స్టీవెన్ స్మిత్-37; అలెక్స్ క్యారీ-36; హాండ్స్ కాంబ్-31 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్ లో 63.5 ఓవర్లు ఆడి 177 పరుగులకు చేతులెత్తేసింది. జడేజా 5; అశ్విన్ ౩; షమీ, సిరాజ్ లకు చెరో వికెట్ దక్కింది.
ఆ తర్వాత ఇండియా ఓపెనర్లు తొలి వికెట్ కు 76 పరుగులు జోడించింది. కెఎల్ రాహుల్ 20 రన్స్ చేసి మర్ఫీ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేపెన్ రోహిత్ అర్ధ సెంచరీ చేశారు. ఆట ముగిసే సమయానికి ఇండియా ఒక వికెట్ నష్టానికి 77పరుగులు చేసింది. రోహిత్ శర్మ -56; అశ్విన్ -0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read : IND Vs AUS: భరత్ కు క్యాప్ – ఇండియా దూకుడు