Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్యాషెస్ నాలుగో టెస్ట్ : ఆసీస్ 416/8 డిక్లేర్డ్

యాషెస్ నాలుగో టెస్ట్ : ఆసీస్ 416/8 డిక్లేర్డ్

4th test of Ashes Series: యాషెస్ సిరీస్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 416 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 3 వికెట్లకు 126 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా నేటి ఆట మొదలు పెట్టింది. ఉస్మాన్ ఖవాజా- 137 పరుగులతో రాణించాడు. స్టీవ్ స్మిత్ కూడా 67 పరుగులు చేశాడు. చివర్లో మిచెల్ స్టార్క్ 34 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువార్ట్ బ్రాడ్ ఐదు వికెట్లు సాధించాడు. జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, కెప్టెన్ రూట్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు హసీబ్ హమీద్, జాక్ క్రాలే చెరో రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్