ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్-2021-23ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్లో ఇండియాపై 209 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించి ఈ టైటిల్ గెల్చుకున్న రెండో జట్టుగా నిలిచింది. బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలం కావడంతో ఇండియాకు పరాజయం తప్పలేదు.
నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసిన ఇండియా…నేడు ఆట చివరిరోజున 280 పరుగులు అవసరం కాగా 71 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిన్న 44 పరుగులతో క్రీజులో ఉన్న కోహ్లీ నేడు మరో ఐదు పరుగులు మాత్రమే చేసి 49 వద్ద వెనుదిరిగాడు. రెహానే-46; శ్రీకర్ భరత్-23; షమీ-13 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469 ఆలౌట్; రెండో ఇన్నింగ్స్- 270/8 డిక్లేర్
ఇండియా తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్; రెండో ఇన్నింగ్స్- 234 ఆలౌట్
తొలుత బౌలింగ్ లోను, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ విఫలమైన ఇండియా ఏ దశలోనూ ఆసీస్ కు పోటీ ఇవ్వలేకపోయింది. అయితే నిన్న రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కంగారూలు ఇండియా ముందు 444 పరుగుల విజయ లక్ష్యం ఉంచారు. 147 ఒవర్లపాటు ఆట మిగిలి ఉండడంతో మన బ్యాట్స్ మెన్ క్రీజులో నిలదొక్కుకొని మేజిక్ చేస్తారని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు.