Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Women's Junior Asia Cup: విజేత ఇండియా

Women’s Junior Asia Cup: విజేత ఇండియా

హాకీ మహిళల జునియర్ ఆసియా కప్ ను ఇండియా గెల్చుకుంది. జపాన్ లోని కకామిగహర లో నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 2-1 తేడాతో కొరియాపై విజయం సాధించి విజేతగా నిలిచింది.

ఆట 22వ నిమిషంలో అన్ను పెనాల్టీ స్ట్రోక్ ద్వారా ఇండియాకు తొలి గోల్ అందించింది. కొరియా క్రీడాకారిణి పార్క్ సియోయెన్ 25వ నిమిషంలో ఓ ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేసింది. 41 వ నిమిషంలో నీలమ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఇండియాకు రెండో గోల్ సాధించి పెట్టింది. ఆ తరువాత ప్రత్యర్థిని భారత యువ మహిళలు నిలువరించారు. చివరి వరకూ అదే పోరాట స్ఫూర్తి ప్రదర్శించి 2-1తో గెలుపొందారు.

హాకీ ఇండియా ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ జట్టు సభ్యులు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, సహాయ సిబ్బంది ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది.

ఈ ఏడాది ఆసియా కప్ జూనియర్ హాకీ పురుషులు, మహిళల టోర్నీలో ఇండియానే విజేతగా నిలవడం విశేషం.

జూన్ 1 న జరిగిన పురుషుల జూనియర్ హాకీ ఫైనల్లో ఇండియా 2-1 తేడాతో దాయాది పాకిస్తాన్ పై గెలుపొంది విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్