ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో మూడు వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 24 పరుగులకే 4 వికెట్లు ( కెప్టెన్ బావుమా డకౌట్, డికాక్ 3; మార్ క్రమ్ 10; వాన్ డెర్ డస్సెన్ 6) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101; క్లాసేన్-47; పరుగులతో ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ చెరో 3; హాజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను దూకుడుగా మొదలు పెట్టింది. 6 ఓవర్లలో 6౦ పరుగులకు తొలి వికెట్ (డేవిడ్ వార్నర్- 29) కోల్పోయంది. మిచెల్ మార్ష్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ హెడ్ 62 పరుగులతో రాణించాడు. స్టీవెన్ స్మిత్-30; జోస్ ఇంగ్లిస్-28; లబుషేన్-18 పురుగులు చేయగా గత మ్యాచ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన మాక్స్ వెల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటై నిరాశ పరిచాడు. మిచెల్ స్టార్క్-16; కెప్టెన్ కమ్మిన్స్-14 పరుగులతో నాటౌట్ గా నిలిచి గెలిపించారు. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొట్జీ, షంసి చెరో రెండు; రబడ, మార్ క్రమ్, కేశవ్ మహారాజ్ తలా ఒక వికెట్ సంపాదించాడు.
ఆల్ రౌండ్ ప్రతిభ చాటిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.