ఇండియా-ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న టి20 సిరీస్ ను అతిథి ఆస్ట్రేలియా ­3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆసీస్ విధించిన భారీ లక్ష్యం కోసం ఇండియా చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. కావాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఓటమి తప్పలేదు. దీనితో 7 పరుగులతో పరాజయం పాలైంది.

ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హేలీ21 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది. గార్డ్ నర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి ఔట్ కాగా…. ఎల్లెసా పెర్రీ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72; గ్రేస్ హారిస్ 12  బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 27 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 43 పరుగులకు ఓపెనర్లు ఇద్దరి వికెట్లు (స్మృతి మందానా-16; షఫాలీవర్మ-20) కోల్పోయింది. జేమియా రోడ్రిగ్యూస్ మరోసారి విఫలమై కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యింది. ఈ దశలో దేవికా వైద్య- కెప్టెన్ హర్మన్ ను నాలుగో వికెట్ కు 72 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే అలానా కింగ్ బౌలింగ్ లో 46 పరుగులు చేసిన హర్మన్ ఔటైంది. దేవికా వైద్య-32 రన్స్ చేసి స్టంప్ ఔట్ గా వెనుదిరిగింది. చివర్లో రిచా ఘోష్-40; దీప్తి శర్మ-12 వేగంగా ఆడినా ఉపయోగం లేకపోయింది.

ఆసీస్ బౌలర్లలో గార్డ్ నర్, అలానా కింగ్ చెరో రెండు; డార్సీ బ్రౌన్ ఒక వికెట్ పడగొట్టారు.

గార్డ్ నర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *