Sunday, March 15, 2026
Homeస్పోర్ట్స్యాషెస్ రెండో టెస్ట్: ఆసీస్ ఘనవిజయం

యాషెస్ రెండో టెస్ట్: ఆసీస్ ఘనవిజయం

Ashes: Australia lead by 2-0: యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా 275 పరుగులతో ఘనవిజయం సాధించింది. 468 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  ఆసీస్ బౌలర్ జే రిచర్డ్ సన్ ఐదు వికెట్లతో రాణించాడు. మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు, మైఖేల్ నేసేర్ ఒక వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లకు 82  పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదోరోజు ఆట మొదుపెట్టిన ఇంగ్లాండ్ మరో 110 పరుగులు మాత్రమే చేసి చేయగలిగింది.

ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. డిసెంబర్ 25 నుంచి మూడో టెస్ట్ మెల్బోర్న్ లో జరగనుంది.

మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ(103); రెండో ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ (51) తో రాణించిన మార్నస్ లాబుస్ చేంజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

Also Read : ఇంగ్లాండ్ ముందు భారీ విజయ లక్ష్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular