Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్నాలుగో మ్యాచ్ కూడా ఆసీస్ దే

నాలుగో మ్యాచ్ కూడా ఆసీస్ దే

Aussies 4th win: శ్రీలంక తో జరిగిన నాలుగో టి 20 లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న  ఆసీస్ నేడు జరిగిన మ్యాచ్ లో  కూడా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక 139 పరుగులు చేయగా విజయ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 4  వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది.  మాక్స్ వెల్  39 బంతుల్లో 3 ఫోర్లతో 48 నాటౌట్;  జోష్ ఇంగ్లిస్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40, ఓపెనర్ ఆశ్టన్ అగర్-26 పరుగులు చేసి రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార రెండు; మహీష్ తీక్షణ, దుష్మంత చమీర చెరో వికెట్ పడగొట్టారు.

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లో  పాథుమ్ నిశాంక-46; కుశాల్ మెండీస్-27; అసలంక-27 మాత్రమే రాణించారు.  మిగిలిన వారు విఫలం కావడంతో నిర్ణీత 20ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో  కేన్ రిచర్డ్సన్, జే రిచర్డ్సన్ చెరో రెండు; అగర్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.

గ్లెన్  మాక్స్ వెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది. ఐదు టి20 ల సిరీస్ లో ఆస్ట్రేలియా 4-0తో ఆధిక్యంతో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్