Saturday, June 13, 2026
HomeTrending Newsవిచారణ పారదర్శకంగా సాగాలి: అవినాష్ రెడ్డి

విచారణ పారదర్శకంగా సాగాలి: అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ జరుపుతోన్న సిబిఐ ముందుకు నేడు కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. కేసు విచారణ కోసం హాజరు కావాలని సిబిఐ మూడ్రోజులక్రితం రెండోసారి నోటీసు పంపిన విషయం తెలిసిందే.  కాగా, నేడు హైదరబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మను అవినాష్ రెడ్డి కలుసుకున్నారు.

మరోవైపు, సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు.  ఈ రోజు విచారణకు హాజరవుతున్నానని తెలియజేస్తూ  విచారణ పారదర్శకంగా సాగాలని కోరారు.  వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైనప్పటినుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.  ఓ వర్గం మీడియా పనిగట్టుకుని లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందని, తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని,  అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు చెప్పారు.

విచారణను ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని, తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐకి విజ్ఞప్తి చేశారు.

Also Read :  నిజం గెలవాలి: వైఎస్ అవినాష్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular