Saturday, June 13, 2026
HomeTrending Newsధన్‌బాద్‌లో అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి

ధన్‌బాద్‌లో అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఆరుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్‌ కారిడార్‌లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు.
మృతులను డాక్టర్‌ హజారా, ఆయన సతీమణి డాక్టర్‌ ప్రేమ హజారాగా గుర్తించారు. మృతుల్లో వారి మేనల్లుడు కూడా ఉన్నారని చెప్పారు. హాస్పిటల్‌ కాంప్లెక్స్‌లోనే వారి ఇళ్లు కూడా ఉందని వెల్లడించారు.

దవాఖానలోని రోగులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్‌బాద్‌ డీఎస్పీ అర్వింద్‌ కుమార్‌ బిన్హా తెలిపారు. ఆస్పత్రి ఘటనపై ముఖ్యమంత్రి హేమంత సోరెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular