Wednesday, July 3, 2024
HomeTrending Newsకేంద్ర అవార్డులే కెసిఆర్ పాలనకు నిదర్శనం : ఎర్రబెల్లి

కేంద్ర అవార్డులే కెసిఆర్ పాలనకు నిదర్శనం : ఎర్రబెల్లి

మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌శాఖకు వచ్చిన కేంద్ర అవార్డులే తమ పని తనానికి, సిఎం కెసిఆర్ పాలన దక్షతకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తూ కేంద్రం నుంచి ఎన్నో అవార్డులను అందుకుంటుందన్నారు. మిషన్ భగీరథకు కేంద్ర పురస్కారం రావడంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ హనుమంతరావు, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులను మంత్రి అభినందించారు. ఖైతరాబాద్‌లోని రంగారెడ్డి జడ్పీ కాన్ఫరెన్స్‌లో హాలులో జరిగిన కార్యక్రమం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తాగునీటికి ఎంతో కష్టాలు పడ్డారని, మహిళల బిందెలు పట్టుకొని ఎంతోదూరం నడుచుకుంటూ వెళ్లేవారని గుర్తు చేశారు. అసెంబ్లీలోనూ విషయంపై చర్చలు జరుగుతుండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కొరత ఉండేదని, ఈ సమస్యలను అధిగమించామన్నారు. కేంద్రం ఎన్నోసార్లు రాష్ట్రాన్ని అభినందించి.. పార్లమెంట్‌లో సైతం రాష్ట్ర అభివృద్ధిని కొనియాడారని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం మన మిషన్‌ భగీరథను కాపీ కొట్టిందని, మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో 50శాతమే నీరిచ్చారన్నారు. కేంద్రం ఢిల్లీలో అభినందిస్తూ గల్లీలో విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కేంద్రం అవార్డులు ఇస్తే రాష్ట్ర నాయకులు ఫేక్‌ లెటర్లు క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ జయంతి రోజున తెలంగాణకు అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు.

సీఎం కేసీఆర్‌ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతిని అద్భుతంగా నిర్వహిస్తున్నారన్నారు. గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి, అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి పథంలో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. తెలంగాణ నుంచి ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమారని ఫ్లోరైడ్‌ లేని.. ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్‌లో ప్రస్తావించారని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరును స్టడీ చేయాలని కేంద్రం అధికారులకు సూచించిందన్నారు. గల్లీలున్న బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూన్నారు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గల్లీలోని నేతలు రెచ్చగొడుతున్నారన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు: మంత్రి ఎర్రబెల్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్