Saturday, November 23, 2024
HomeTrending Newsరామ్‌పూర్‌లో ఆజంఖాన్ కుటుంబానికి షాక్

రామ్‌పూర్‌లో ఆజంఖాన్ కుటుంబానికి షాక్

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్‌పూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్‌వాదీ పార్టీ నేత అజామ్‌ ఖాన్‌ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలోనే తొలిసారి ఎన్నికలకు దూరమైంది. విధ్వేష వ్యాఖ్యల కేసులో దోషిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత అజామ్‌ ఖాన్‌కి తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు మూడేళ్లు శిక్ష వేసింది. కోర్టు శిక్షతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో రామ్‌పూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌ 5వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నికలో అజామ్‌ ఖాన్ భార్య తంజీన్‌ ఫాతిమా గానీ, ఆయన కోడలు గానీ బరిలో దిగుతారని అంతా భావించారు. అయితే, ఎస్పీ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో అసీమ్‌ రజా ఖాన్‌కు టికెట్‌ కేటాయించింది.

గతంలో అజామ్‌ ఖాన్‌ తన పార్లమెంట్‌ స్థానానికి రాజీనామా చేసినప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థిగా రజా ఖాన్‌ పోటీలో నిలిచారు. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా ఈ ఎన్నికలో రజా ఖాన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రామ్‌పూర్‌ నియోజకవర్గానికి 1997 నుంచి 2022 సంవత్సరం వరకు మొత్తం 12 అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకు పదిసార్లు అజామ్‌ ఖానే గెలిచారు. రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2019లో అజామ్‌ ఖాన్ ఎంపీగా గెలుపొందడంతో రామ్‌పూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య తజీన్ ఫాతిమా బరిలోకి దిగి విజయం సాధించారు. తాజాగా ఎస్పీ అనూహ్య నిర్ణయంతో 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్‌ పడినట్లైంది.

Also Read : మెయిన్ పురి నుంచి డింపుల్ యాదవ్ నామినేషన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్