Monday, June 17, 2024
HomeTrending Newsఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ ప్రభుత్వానికి పెను సవాలు

ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ ప్రభుత్వానికి పెను సవాలు

ఆఫ్ఘనిస్తాన్, భారత్ లో ఆశాంతి సృష్టించేందుకు పాకిస్తాన్ సృష్టించిన జిహాదీ గ్రూపులు ఆ దేశానికే ముప్పుగా పరిణమించాయి. ఆఫ్ఘన్, భారత్ సరిహాద్దుల్లోని ఖైభర్ పఖ్తుంక్వ, వజిరిస్తాన్ ప్రాంతాల్లో నిత్యం ఎదో ఒక రూపంలో ఉగ్రవాదులు పాక్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. గ్రంమాల్లో జిర్గా దే తుది నిర్ణయమని తెగేసి చెపుతున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడిలో పోలీసులు చనిపోవటం ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ముఖ్యంగా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు  సానుబుతిపరులు పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది.

పాకిస్తాన్ లో ఉగ్రవాదమే ప్రధాన సమస్యగా ఉందని ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. పాకిస్థాన్‌ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు వ్యాన్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.

‘పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న సమస్యల్లో అన్నింటికంటే ప్రధానమైనది ఉగ్రవాదమే. దేశాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోంది. ఉగ్రవాదంపై పోలీసులు, సైనికులు అత్యంత సాహసంతో పోరాడుతున్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు వ్యాన్‌పై జరిగిన ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడంలేదు. దాడిలో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఖైబర్ ఫక్తుంఖ్వాలోని లాకీ మార్వాత్‌లో ఓ పోలీస్ వ్యాన్‌పై బుధవారం ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ వజీరిస్థాన్ సరిహద్దులోని లకీ మార్వాత్‌ జిల్లాలో గుర్తుతెలియని ముష్కరులు పోలీసులు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి తెగబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్