బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘వీరసింహారెడ్డి‘ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఒంగోలులో గ్రాండ్ గా జరిగింది. ఈవెంటుకి స్పెషల్ గెస్టుగా సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ వచ్చారు. ఆయన చేతనే ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

ఈ  స్టేజ్ పై బాలకృష్ణ మాట్లాడుతూ .. “ఈవెంట్ కి గెస్టుగా ఎవరిని పిలుద్దాం అని మా వాళ్లు అడిగారు. ఈ వేదికను శాసించే హక్కు ఎవరికీ లేదు .. ఆ అర్హత బి. గోపాల్ కి మాత్రమే ఉందనిపించింది. ఆయన నాతో చేసిన ‘లారీ డ్రైవర్’ .. ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ .. ‘సమరసింహారెడ్డి’ .. నరసింహా నాయుడు’ వంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. అందువలన ఈ వేదికకు ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చే బి. గోపాల్ గారిని పిలుద్దామని అన్నాను’.

ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని నా అభిమానినని చెప్పారు .. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆయన చాలా గొప్ప సినిమా తీశాడు .. ఈ సినిమాలో చేయడమనేది  నాకు గర్వంగా అనిపిస్తోంది. నటీనటుల నుంచి హావభావాలను .. సాంకేతిక నిపుణుల నుంచి అవుట్ పుట్ ను రాబట్టుకునే మంచి సత్తా ఉన్న ఒంగోలు గిత్త గోపీచంద్ మలినేని.  నేను చేసిన ‘ఆదిత్య 369’ .. ‘అఖండ’ మాదిరిగా ఈ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *