Sunday, January 19, 2025
HomeTrending Newsభవిష్యత్ తరాల కోసం ఆలోచించాలి: బాబు

భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలి: బాబు

రాబోయే 25 ఏళ్ళకు దేశ వ్యాప్తంగా ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకువెళ్ళాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. మెదట దేశం గురించి, ఆ తర్వాతే మన గురించి ఆలోచించాలని కోరారు. నాడు మహనీయులు కూడా దేశ స్వాతంత్రం కోసం కాకుండా స్వార్థంతో  ఆలోచించి ఉంటే ఏమయ్యేదో ఆలోచించుకోవాలని  హితవు పలికారు. ప్రపంచంలోనే మేధాసంపత్తి ఎక్కువగా కలిగిన దేశం మన భారత దేశమని పేర్కొన్నారు. పివి నరసింహారావు, వాజ్ పేయి లాంటి నేతలు ఎంతో దూరదృష్టితో ఎన్నో సంస్కరణకు బీజం వేశారని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర  దినోత్సవ వేడుకల్లో భాగంగా గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.

పాలకులు అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెను ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ 75 ఏళ్ళ పాలనలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం జరిగిందో సమీక్ష, ఆలోచన చేసుకొని, దేశ హితం కోసం ఇంకా ఏమి చేయాలో ఆలోచించాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో ఓ సీనియర్ నాయకుడిగా భాగస్వామ్యం వహించినందుకు తాను ఎంతో సంతోషపడుతున్నానని, ఇది ఎంతో స్ఫూర్తి ఇస్తుందని చెప్పారు.

పేదరికాన్ని నిర్మూలించి, ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి మనదరం పాటు పడదామని చంద్రబాబు కోరారు.  సమాజంలో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారని… ఈ అసమానతలు తొలగించలేకపోతే సమాజం ఆనందంగా  ఉండదాని  పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్