Sunday, January 19, 2025
HomeTrending NewsBabu: ప్రతి ఓటూ పరిశీలించాలి: బాబు విజ్ఞప్తి

Babu: ప్రతి ఓటూ పరిశీలించాలి: బాబు విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయని, ఉన్నవాటిని తీసేయడం లేదా కొత్తవారిని అక్రమంగా చేర్పించడం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు. తాము ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్క అంశానికీ  సాక్ష్యాధారాలతో, సిడిల రూపంలో ఎన్నికల సంఘానికి అందజేశామని చెప్పారు. జీరో డోర్ నంబర్లతో, కొన్ని నకిలీ డోర్ నంబర్లతో ఓట్లు సృష్టించారని తెలిపారు, వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు పంపుతున్నారని, దీనిపై కూడా ఆధారాలు ఇచ్చామన్నారు.  బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్ళకుండా వాలంటీర్ల సహాయంతోనే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, విశాఖలో 40 వేలు, మచిలీపట్నంలో 5,300 గల్లంతు అయ్యాయని,  ఉరవకొండలో కూడా అక్రమాలు జరిగాయని, దీనిపై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేశవ్ ఫిర్యాదు మేరకు ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేశారని తెలిపారు.

ఎన్నికల జాబితా ప్రక్షాళన పూర్తైన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే ఫలితాలపై ఆ ప్రభావం ఉంటుందని బాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంకోసం ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

తిరుపతి ఎంపి ఉపఎన్నికల్లో  కూడా కనీసం నంబర్  లేకుండానే ఓటర్ గుర్తింపు కార్డులు తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్ తనకు రక్షణ లేదని చెప్పారని బాబు గుర్తు చేశారు,  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓట్లు కూడా నకిలీవి తయారు చేశారని బాబు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియలో భాగంగానే తాను ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వచ్చానని తెలిపారు.  అధికారంలో ఉన్న పార్టీ  విపక్షాల ఓట్లు తీసేసే పధ్ధతి ఇప్పటివరకూ తాను చూడలేదన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా అక్రమాలకు పాల్పడిన అధికారులను  సస్పెండ్ చేయడం లేదని, ఎన్నికల సిబ్బందిగా టీచర్లు, అంగన్ వాడీలు లను నియమించడం లేదని, వాళ్లకు కావాల్సిన మనుషులను మాత్రమే సెలక్షన్ చేస్తున్నారని దీనిపై కూఒడా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులంతా  ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి అక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని, అక్రమాలపై చర్యలు తీసుకొని నిస్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితా ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు.  ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని, ఇతర రాష్ట్రాలకు చెందిన ఐ ఏ ఎస్ అధికారులను పంపాలని, ప్రత ఓటునూ క్షుణ్ణంగా పరిశీలించాలని కోరామన్నారు.

ప్రాంతీయ పార్టీగా ఉన్నా జాతీయ భావాలతో దేశ అభివృద్దికి యెనలేని కృషి చేశారని, ఆయన పేరుతో వంద రూపాయల నాణెం తీసుకురావడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, నాణెం విడుదల చేసిన భారత రాష్ట్ర పతికి బాబు ధన్యవాదాలు తెలియజేశారు.  ఆయనకు భారత రత్న అవార్డు ఇవ్వాలన్నది తెలుగువారందరి అభిప్రాయమని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్