Sunday, February 23, 2025
HomeTrending NewsRoja: సీమకు మీరేం చేశారో చెప్పండి: రోజా

Roja: సీమకు మీరేం చేశారో చెప్పండి: రోజా

రాయల సీమకు అసలైన ద్రోహి చంద్రబాబే నని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 14 ఏళ్ళపాటు సిఎంగా ఉన్న చంద్రబాబు సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత ఆయనకు లేదని, ఆయన సిఎంగా ఉన్నప్పుడు శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా పూర్తి చేశారా అని ఆమె ప్రశ్నించారు. పుత్తూరు మున్సిపాలిటీ లోని గోవిందపాళ్ళెం , పిళ్ళారిపట్టు మరియు దాసరిగుంట సచివాలయాల పరిధిలో గురువారం జరిగిన జగనన్న_సురక్ష కార్యక్రమంలో  ఆమె  పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ  2018లోనే పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఆ ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంలో కూడా బాబు అవినీతికి పాల్పడ్డారని అందుకే అది కొట్టుకు పోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజేక్తును ఒక ఏటిఎం లా చంద్రబాబు వాడుకున్నారని స్వయానా ప్రధాని మోడీ ఆరోపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టింది వైఎస్సార్ అయితే పూర్తి చేసేటి వైఎస్ జగన్ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్