Saturday, April 20, 2024
HomeTrending Newsపుడమితల్లి వారసుల ఉద్యమం: బాబు

పుడమితల్లి వారసుల ఉద్యమం: బాబు

Babu Called On People To Support Amaravathi Maha Pada Yatra :

అమరావతి ‘మహా పాదయాత్ర’కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమం 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. ఇది పాదయాత్ర కాదని, రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని పేర్కొన్నారు. ఈ మేరకు అయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ యాత్ర రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగంచేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని, అమరావతి ఉద్యమంపై పాలక పక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలు చేసినా అద‎రక, బెదరక అనుకున్న ఆశయ సాధన కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం చేస్తున్న ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఈ మహాపాదయాత్ర ద్వారానైనా  పాలకులకు కనువిప్పు కలగాలని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలని…పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై చూపుతున్నశ్రద్ద రాష్ట్రాభివృద్ది పై చూపడం లేదని బాబు మండిపడ్డారు. విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతున్న తరుణంలో 3రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు.

1999 లో విజన్ 2020 తో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసుకున్నామని,  విభజన అనంతరం విజన్ 2029 లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్దికి నాంది పలికామని వెల్లడించారు. ఓవైపు విజన్ 2020 ఫలితాలు చూసి  సంతోషం కలుగుతున్నా, మరో వైపు విజన్ 2029 ప్రణాళికల అమలుపై గొడ్డలివేటుతో బాధ కలుతోందన్నారు. ఎప్పుడూ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించి ముందు చూపుతో నిర్ణయాలు తీసుకునే వారే నాయకుడుని హితవు పలికారు.

అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని, అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకార మవుతుతుందని అయన హెచ్చరించారు. ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజాసంఘాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అభివృద్దిని కాంక్షించే ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.  5 కోట్ల ప్రజల గుండె చప్పుడు, ‎తెలుగు జాతి అఖండ జ్యోతి అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

Must Read :అమరావతి కేసు 19కి వాయిదా

RELATED ARTICLES

Most Popular

న్యూస్