Babu fire: విజయవాడ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియదు కానీ ప్రతిపక్ష నేతగా తాను సిగ్గుపడుతున్నానని టిడిపి అధినేత చందబాబు వ్యాఖ్యానించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సిఎం జగన్ మహిళలకు సున్నా వడ్డీ రుణాల పథకం అంటూ నేడు ఒంగోలు వెళ్ళారని, కానీ అయన వెళ్ళాల్సింది అక్కడకు కాదని, ఇక్కడ ఆస్పత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శించాల్సి ఉందన్నారు. సిఎం జగన్ పాలనలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో అత్యాచార సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన అత్యాచార బాధితురాలిని చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
ఈ సందర్భంగా బాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం ఉందని, ఆడబిడ్డలపై ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇంకెన్ని ఘటనలు జరిగితే స్పందిస్తారని నిలదీశారు. ప్రభుత్వానికి నీతి, నిజాయతీ ఉంటే వెంటనే నిందితులకు ఉరిశిక్ష వేయాలని సవాల్ చేశారు. ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలపై ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవాలని, కోటి రూపాయల హరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, మహిళలకు రక్షణ లేదని బాబు విమర్శించారు. మొన్న ఒంగోలులో సిఎం కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి కారు లాక్కోవదాన్ని బాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Also Read : విజయవాడ ఆస్పత్రి ఘటనపై సిఎం సీరియస్