Saturday, April 20, 2024
HomeTrending Newsజగన్ కుమార్తెలపై చంద్రబాబు వ్యాఖ్యలు

జగన్ కుమార్తెలపై చంద్రబాబు వ్యాఖ్యలు

Babu Comments: రాష్ట్రంలో పేద విద్యార్ధులను విదేశీ చదువులు అందించే పథకాన్ని తాము ప్రవేశ పెడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సిఎం జగన్.. ఒక కూతురు ఫ్రాన్స్ లో, మరో కూతురు లండన్ లో చదువుతున్నారని, కానీ పేదవారి పిల్లలు మాత్రం నాలుగు కిలోమీటర్ల పాటు వంకలో,  వాగులో నడిచి వెళ్ళాల్సి వస్తుదని, ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని చదవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ తన కూతురు గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి ప్రత్యేకమైన, విలాసవంతమైన విమానం వేసుకొని వెళ్ళారని, కానీ మన పిల్లలకు సైకిల్ కూడా లేదని దుయ్యబట్టారు. తన హయంలో స్కూళ్ళకు వెళ్ళే ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చామని, ఇప్పుడు ఆ పథకం ఏమైందని ప్రశ్నించారు.

అమ్మ ఒడి పథకానికి అంక్షల పేరుతో మోసం చేస్తున్నారని, 300 యూనిట్లు కరెంటు వాడితే రద్దు చేస్తున్నారని, విద్యుత్ బిల్లు, హాజరు, ఉత్తీర్ణత అంటూ నిబంధనలు విధించి ఎగ్గొడుతున్నారని విమర్శించారు. తమ హయాంలో ఎప్పటికప్పుడు డిఎస్సీలు నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేశామని, సమైక్య రాష్ట్రంలో లక్షా 60 వేల టీచర్ పోస్టులు  భర్తీ చేసిన ఘనత తమకే దక్కుతుందని….. గత ఐదేళ్ళలో కూడా వేలాది పోస్టులు భర్తీ చేశామని…. కానీ  ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క పోస్టు కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 8 వేల పాఠశాలలు మూసి వేస్తున్నారని…అమ్మ ఒడి బూటకం-ఇంగ్లీష్ మీడియం నాటకం… అంటూ ధ్వజమెత్తారు.

పోలీసులకు రావాల్సిన ఎరియర్స్ రావడం లేదని తాను చోడవరంలో తాను చెబితే ఆ మర్నాడే 18 కోట్లు విడుదల చేశారని, పోలీసులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చెప్పిందని తప్పుడు పనులు చేయవద్దని సూచించారు.

జిల్లాకు చెందిన ఓ మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తున్నారని, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులు కుటుంబంలో పెట్టుకొని రౌడీయిజానికి పాల్పడుతున్నారని, ఇది కలకాలం సాగదని హెచ్చరించారు. మీరు చేస్తున్న పనులకు భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లిస్తామని  మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Also Read : వ్యతిరేకత వెల్లడైంది: చంద్రబాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్