Monday, June 8, 2026
HomeTrending Newsవైఎస్సార్సీపీ ప్లీనరీ: మొదటిరోజు ఐదు తీర్మానాలు

వైఎస్సార్సీపీ ప్లీనరీ: మొదటిరోజు ఐదు తీర్మానాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతోన్న మొదటి ప్లీనరీ కావడంతో పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ  మొదటి రోజు ఎజెండాను ముఖ్యనేతలు ఖరారు చేశారు. మొదటి రోజు ఐదు తీర్మానాలు చేపట్టనున్నారు.

ఉదయం 8 ప్లీనరీ ప్రారంభం

ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ సభ్యుల రిజిస్ట్రేషన్

10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండా ఆవిష్కరించనున్న అధ్యక్షుడు వైఎస్ జగన్

10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన

10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు, అనంతరం సర్వమత ప్రార్థనలు

10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం

పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం

అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం

11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదన

ఆ తర్వాత ప్రారంభం కానున్న తీర్మానాలు

11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం.
తీర్మానం పై మాట్లాడనున్న మంత్రులు ఉషశ్రీ చరణ్,  రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి

ఒంటిగంటకు రెండో అంశం గా విద్య పై తీర్మానం
ఈ అంశంపై మాట్లాడనున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్

రెండు గంటల 15 నిమిషాల నుంచి ఒక పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు

మధ్యాహ్నం 2:30 కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం
డీబీటీ పై మాట్లాడనున్న మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి

మూడు గంటల 15 నిమిషాలకు వైద్యం పై తీర్మానం
వైద్యం అంశంపై మాట్లాడనున్న మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని

సాయంత్రం నాలుగున్నరకు పరిపాలనా- పారదర్శకత అంశం పై చర్చ
ఈ అంశంపై మాట్లాడనున్న స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి

సాయంత్రం ఐదు గంటలతో ముగియనున్న మొదటిరోజు ప్లీనరీ సమావేశం

Also Read :  కార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ: నేతల సూచన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular