Sunday, January 19, 2025
HomeTrending NewsKarumuri: బాబుకు ఆ అర్హత లేదు: కారుమూరి

Karumuri: బాబుకు ఆ అర్హత లేదు: కారుమూరి

రాష్ట్ర ప్రజలు మరోసారి రావాలి జగన్- కావాలి జగన్ అంటున్నారని, అది చూసి తట్టుకోలేక తెలుగుదేశం విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబు ముసలి నక్క అయిపోయారని, కనీసం మైకు కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, అందుకే తల చుట్టూ మైక్ ఉంచుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం కల అని,  చివరకు ఆ పార్టీలో బాబు, ఆయన కొడుకు లోకేష్ తప్ప ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు.

గృహ సారథులు ప్రతి ఇంటికి తిరుగుతుంటే జగన్ మళ్ళీ రావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.  బాబు అధికారంలో ఉన్నప్పుడు తన వాళ్ళకే మంచి చేశారని, కానీ జగన్ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు.  ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు  అనుకుంటున్నారన్నారు.

జగన్ తన తల్లి విజయమ్మకు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటూ  బాబు చేసిన విమర్శలపై  కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద కొడుకై ఉండి కన్నతల్లికి కొరివి పెట్టని బాబుకు దీనిపై మాట్లాడే అర్హత లేదన్నారు. తల్లికో, కూతురికో విషెస్ చెబితే అది అందరికీ తెలియాలా అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్