Sunday, January 19, 2025
HomeTrending Newsహామీలు నెరవేర్చే అలవాటు బాబుకు లేదు : జగన్

హామీలు నెరవేర్చే అలవాటు బాబుకు లేదు : జగన్

చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, పవన్ కు విలువలు లేవని… వీరు మూడు పార్టీల కూటమిగా ఏర్పడి తనపై యుద్ధానికి వస్తున్నారని, పేదవాడి భవిష్యత్ మీద కూడా యుద్ధానికి వస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఈ ముగ్గురూ 2014ల్లో కలిసి పోటీ చేశారని, ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగానే గతంలో కూడా ఇచ్చారని… కానీ  అమలు చేయలేదని విమర్శించారు. వైయస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు.

* పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి.
* ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి.
* వైయస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైయస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావు. అయినా వారికి త తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
* 2014 ఎన్నికల మేనిఫెస్టోను  చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు.
* ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.
* 87612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు.
* పొదుపు సంఘాల రుణాలు 14205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు.
* మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు.
* ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు.
ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకుగానీ, మీకు తెలిసిన వారికిగానీ ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నా.


* ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాలకు రూ.1.25 లక్షలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా?
* పాంప్లేట్లు చూపించాడు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు.
* మేనిఫెస్టో అని తెచ్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు.
* 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో పేజీ నంబర్ 16, 17లో.. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 9 హామీలిచ్చారు
* బెల్ట్ షాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామన్నారు.
* పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు.
* పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు.
* పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణులకు రూ.10 వేలు అందిస్తామన్నారు.
* పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు.
* సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ పై రూ.100 సబ్సిడీ. 5 ఏళ్లలో రూ.6,00 ఇస్తామన్నారు.
* హైస్కూలు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు.
* మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు.
* మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్.. ఇవన్నీ కేవలం మహిళలకు సంబంధించిన 9 హామీలు.
* ఇందులో ఏ ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నా.
* వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని ఒక మనవడిగా, మనవరాలిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా.. ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మర్చిపోవద్దండి.


* పొరపాటు జరిగిందంటే ఇక బటన్లు నొక్కడం, మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది.
* మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలొస్తాయి, ఎక్కడ పడితే అక్కడ లంచాలు, వివక్ష వస్తాయి.
* పేదల బతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి. అంధకారమయమైపోతాయి.
* పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి ఉంటుందని మాత్రం అందరూ గుర్తెరగమని సవినంగా కోరుతున్నా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్