Sunday, September 29, 2024
HomeTrending Newsమరో జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతా: బాబు భావోద్వేగం

మరో జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతా: బాబు భావోద్వేగం

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి…అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి ప్రజల నుండి రూ.100 దోచిందని…తమ ప్రభుత్వం రూ.15 ఇచ్చి…రూ.100 సంపాదించే మార్గం చూపుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, పేదరికం లేని సమాజం సాధించేలా పాలన అందిదస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం మొదటి రోజు శాంతిపురం మండలం, చిన్నారిదొడ్డి వద్ద హంద్రీనీవా సుజల శ్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….‘‘నేను 9వ సార్లు ఎమ్మెల్యే అయితే…రూ.8 సార్లు కుప్పం నుండే విజయం సాధించాను. అన్ని ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో కుప్పం ప్రజలు నన్ను గెలపించారు. నామినేషన్ కు నేను రాకపోయినా మీరే నా తరపున వేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను. 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి గెలిచింది….వైసీపీని చిత్తుగా ఓడించారు. ప్రజాస్వామ్యంలో విర్రవీగితే వైసీపీకి పట్టిన గతే ఎవరైనా పడుతుంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాలను ప్రజలు గెలిపించారు. 20 పార్లమెంట్లలో 7కు 7 స్థానాలు గెలివడం ఒక చరిత్ర. 21 పార్లమెంట్ స్థానాలు కూటమికి ఇచ్చారు. వైసీపీ ఒక అరాచక పార్టీ. దాన్ని ఇంటికి పంపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరిగరాయబోతున్నాం. నేను చేపట్టబోయే ఏ కార్యక్రమాన్ని అయినా ఇక్కడే ప్రయోగించి…ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తా.’’ అని సీఎం అన్నారు.

‘‘2019 నుండి 2024 వరకు ఒక పీడకల. ఐదేళ్లు అరాచకం సృష్టించారు…దౌర్జన్యాలు చేశారు. నా జోలికే వచ్చారు. అన్నాక్యాంటీన్ పెట్టి అన్నం పెట్టాలనుకుంటే వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. కుప్పంలో గ్రానైట్ మొత్తం తినేసి కేజీఎఫ్ తలపించేలా దోపిడీ చేశారు. నేను కుప్పం వస్తున్నానంటే జీవో-1 ద్వారా మన వాళ్లపై దాడులు చేసి కేసులు పెట్టారు…30 మందిని జైల్లో పెట్టారు. ఇది నేను మర్చిపోతానా.? నాకు ఎవరిపైనా కోపం లేదు…కుప్పం ప్రజలపై ప్రేమ మాత్రమే ఉంది. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా…కుప్పంలో రౌడీ యిజం చేస్తే అదే చివరి రోజు. రౌడీ యిజం, గంజాయి కుప్పంలో ఉండటానికి వీలులేదు. కుప్పం మున్సిపాలిటీలో పన్నులు పెంచారు తప్ప అభివృద్ధి లేదు. మోడల్ మున్సిపాలిటీగా కుప్పంను మార్చుతాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తా. నాలుగు మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్