Saturday, January 18, 2025
HomeTrending Newsకేసరపల్లి ఐటి పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం

కేసరపల్లి ఐటి పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వేదిక, ముహూర్తం ఖరాయ్యాయి. ఈ నెల 12న ప్రమాణం చేయాలని నిన్ననే నిర్ణయించినా ఏ ప్రదేశంలో చేయాలనేదానిపై స్పష్టత రాలేదు. అమరావతి ప్రాంతం, మంగళగిరి ఎయిమ్స్ పక్కనే ఉన్న గ్రౌండ్స్ .. రెంటినీ అధికారులు ఎంపిక చేసినా దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసులో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,  ప్రభుత్వ ఉన్నతాధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ప్రమాణం చేయనున్న కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అచ్చెన్నాయుడు అధికారులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్