Saturday, January 25, 2025
HomeTrending NewsChandrababu: పేదవారిని ఆర్ధికంగా పైకి తెస్తాం: బాబు  

Chandrababu: పేదవారిని ఆర్ధికంగా పైకి తెస్తాం: బాబు  

ఎన్టీఆర్ జన్మించిన గడ్డ నిమ్మకూరును మరింత అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక్కడ భెల్ కంపెనీ తీసుకు వచ్చామని, దీనితో నిమ్మకూరుకు పూర్వ వైభవం వస్తుందని, దానితో పాటు స్థానికులు కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా నిమ్మకూరు గ్రామస్తులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, నందమూరు సుహాసిని, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.  ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు చంద్రబాబు నివాళులర్పించారు.  సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మీ అందరి మధ్యా పెరిగి  ఓ అసాధారణ వ్యక్తిగా ఎదిగారని గ్రామస్తులతో బాబు అన్నారు.

వచ్చే ఏడాది ఎన్నికలు  వస్తున్నాయని, ప్రజా చైతన్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని బాబు వెల్లడించారు. సమాజమే దేవాలయం – పేదలే దేవుళ్ళు అన్న సిద్ధాంతాన్ని చెప్పిన వ్యక్తీ ఎన్టీఆర్ అని, ఈ స్పూర్తితోనే సమాజంలో అట్టడుగున ఉన్న పేదవారిని అసమానతలు రూపుమాపి ఆర్ధికంగా పైకి తీసుకురావడమే తన ముందున్న కర్త్యవ్యమని, దీన్ని ఇక్కడినుంచే మొదలు పెడతామని….సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధి చేస్తామని బాబు భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్