Historical need: చంద్రబాబునాయుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్ళ పాలనలో సిఎం జగన్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరూ అసహ్యించుకునే స్థాయికి దిగాజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమర్ధవంతుడైన నాయకుడు వస్తేనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుందని…. ఆరునూరైనా, ఎవరు అడ్డొచ్చినా చంద్రబాబు సిఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో విద్యుత్ కార్మికుల ఆందోళనలో అచ్చెన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మట్లాడుతూ ఐదువేల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి కొల్లగొట్టడానికే ఈ పథకం ప్రవేశ పెట్టారని మండిపడ్డారు.
సిఎం జగన్ అన్ని వర్గాలనూ మోసం చేశారని, చంద్రబాబుకే సాధ్యం కాని సీపీఎస్ రద్దు జగన్ తో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఏపీ ఆస్తులను సిఎం జగన్ తెలంగాణకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని రంగాలతో పాటు విద్యుత్ రంగం కూడా చిన్నాభిన్నం అయ్యిందని, చంద్రబాబు హయాంలో నిరంతర విద్యుత్ ఇచ్చామని, విభజన హామీల పరంగా 6,500 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సి ఉందని వాటిని వసూలు చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మిక సంక్షేమానికి ఎంతో కృషి చేశామని, కార్మికులంతా తమతోనే ఉంటారని ఆశించామని, కానీ పాదయాత్రలో జగన్ పెట్టిన దండాలకు మోసపోయారని వ్యాఖ్యానించారు.
Also Read :బాబుకు అమావాస్య, రాష్ట్రానికి పొర్ణమి