Polavam: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేలా చూడాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై షెకావత్ కు బాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కంట్రాక్టర్ ను మార్చే క్రమంలో వరద నీటి నిర్వహణ పనులు చేపట్టలేదని, అందుకే డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని అయన దృష్టికి తీసుకు వచ్చారు.
కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన సూచనలను రాష్ట్రం పెడచెవిన పెట్టిందని, డయాఫ్రమ్ వాల్ ద్వారా ప్రాజెక్టుకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు 800కోట్ల రూపాయలు అవసరమవుతాయని కేంద్ర మంత్రికి వివరించారు.