బాలయ్య మూవీ టైటిల్ ఇదే.

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ కాంబో మూవీని ప్రకటించినప్పటి నుంచి అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? బాలయ్య మార్క్ యాక్షన్ మూవీనా..? అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైనరా..? అనే డౌట్ ఉండేది. అయితే.. అటు బాలయ్య మార్క్ యాక్షన్ తో పాటు ఇటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్యని ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా ఈ మూవీలో అనిల్ చూపించనున్నాడని తెలిసింది.

ఇక ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే.. మూడు అక్షరాల టైటిల్ ఖరారు చేశారని వార్త వచ్చింది. ఇప్పుడు మూడు అక్షరాలు టైటిల్ కాదని ఓ టైటిల్ లీకైంది. ఇంతకీ ఏంటా టైటిల్ అంటే..’భగవత్ కేసరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని.. దీనికి ఐ డేంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్ అని సమాచారం. ఈ టైటిల్ ను రిజిష్టర్ చేయించారని తెలిసింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ మూవీ టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *