Sunday, June 14, 2026
Homeసినిమాపవన్ ని సూటిగా ప్రశ్నించిన బాలయ్య

పవన్ ని సూటిగా ప్రశ్నించిన బాలయ్య

బాలకృష్ణ.. ‘అన్ స్టాపబుల్’ అంటూ టాక్ షోలో తనదైన స్టైల్ లో హోస్ట్ గా చేస్తూ.. గెస్ట్ ల నుంచి మంచి సమాచారాన్ని రాబడుతున్నారు. బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ తో మరింత క్రేజ్ సంపాదించారు. నారా చంద్రబాబు నాయుడుతో సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. ఆతర్వాత శర్వానంద్, అడివి శేష్, ఇలా యంగ్ హీరోలను ఈ టాక్ షోకు పిలిచిన బాలయ్య రీసెంట్ గా ప్రభాస్ ని ఈ టాక్ షోకు పిలవడం జరిగింది. ఈ ఎపిసోడ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోలో గెస్ట్ గా పాల్గొన్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తారా అని అటు నందమూరి బాలయ్య అభిమానులు ఇటు పవర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ‘ఆహా’ ఈ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేసింది. పవన్ ను కూడా తనదైన శైలిలో బాలయ్య పలు ప్రశ్నలు అడగడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మీ అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి..? వద్దనుకున్నవి ఏంటి..? అంటూ పవన్ ను బాలయ్య ప్రశ్నించారు.

అంతే కాకుండా, రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే.. కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదని బాలయ్య.. పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటివే అనేక ప్రశ్నల సమాహారం ఈ ఎపిసోడ్ అని టీజర్ చూస్తే తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో ఆహా యాప్ క్రాస్ అయ్యింది. దీంతో పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు కూడా ఆహా యాప్ క్రాస్ అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. మరి… పవన్ ఎపిసోడ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular