Friday, April 19, 2024
Homeసినిమా'భోళా శంకర్' డేట్ లో వస్తున్న 'ఏజెంట్'.?

‘భోళా శంకర్’ డేట్ లో వస్తున్న ‘ఏజెంట్’.?

అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడంతో ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏజెంట్ మూవీ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ టీజర్ అండ్ మేకింగ్ వీడియో మూవీ పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి.

అయితే.. ఇప్పటికే చాలా సార్లు వాయిదాపడిన ఏజెంట్ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. సమ్మర్ లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే.. ఏజెంట్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయకపోవడంతో సమ్మరలో అయినా ఏజెంట్ వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే..’భోళా శంకర్’ రిలీజ్ డేట్ కి ఏజెంట్ రాబోతుందని సమాచారం. ఇంతకీ మేటర్ ఏంటంటే.. చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే.. సిస్టర్ క్యారక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తుంది.

తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. అయితే.. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా ఏప్రిల్ 14న భోళా శంకర్ అని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ డేట్ కి ఏజెంట్ రాబోతున్నాడని తెలిసింది. కారణం ఏంటంటే.. భోళా శంకర్, ఏజెంట్ ఈ రెండు చిత్రాల నిర్మాత ఒకరే. ఆయనే అనిల్ సుంకర. చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ సాధించారు. అందుచేత చిరు మూవీ ఆలస్యం అయినా ఫరవాలేదు కానీ.. అఖిల్ ఏజెంట్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అందుచేత భోళా శంకర్ డేట్ కి ఏజెంట్ రిలీజ్ చేసేందుకు చిరు కూడా ఓకే అన్నారట. మరి.. త్వరలోనే ఏజెంట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్