Saturday, June 13, 2026
Homeసినిమామహేష్‌ తో జక్కన్న ఇంటర్నేషనల్ మూవీ

మహేష్‌ తో జక్కన్న ఇంటర్నేషనల్ మూవీ

మహేష్‌ బాబు, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో మూవీ అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. అయితే.. బాహుబలి సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ వైపు చూసేలా చేస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్.. టాలీవుడ్ వైపు చూసేలా చేశారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ మూవీని చూసిన హాలీవుడ్ మేకర్స్ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా.. తర్వాత ఆయన తీసే సినిమా కోసం వాళ్లంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో జక్కన్నకు చాలా పెద్ద మార్కెట్టే క్రియేటైంది. మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమాకు ఆకాశమే హద్దు అనడంలో సందేహం లేదు. రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు. మహేష్‌ బాబుతో చేస్తున్న మూవీ మరో ఎత్తు. గత కొన్ని నెలల నుంచి ఓ వైపు మహేష్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తూనే.. ప్రీ ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ కోసం భారీ ప్రణాళికలే వేస్తున్నాడు జక్కన్న. కాస్టింగ్ ఇతర అవసరాల కోసం క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (సీసీఏ)తో రాజమౌళి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ధ్రువీకరించాడు.

మహేష్‌తో తాను చేయబోయే సినిమాకు అంతర్జాతీయ ఆర్టిస్టుల అవసరం పడుతుందని.. అలాగే గ్రాషిక్స్, ఇతర అవసరాలకు ప్రొఫెషనల్స్‌ను ఎంచుకునేందుకు గాను సీసీఏతో ఒప్పందం జరిగిందని.. ఆ దిశగా ఆ సంస్థతో తన టీం పని చేస్తోందని తెలిపాడు జక్కన్న. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇప్పటి దాకా తన సినిమాలకు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ సాయం తీసుకున్నప్పటికీ, మహేష్ సినిమాకు మరింత ప్రొఫెషనల్‌గా వెళ్లబోతున్నాడని అర్ధం అవుతుంది. ఈ సినిమాతో మరోసారి జక్కన్న చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular