Monday, June 8, 2026
Homeసినిమా'వీరసింహారెడ్డి' స్టోరీ ఇదేనా

‘వీరసింహారెడ్డి’ స్టోరీ ఇదేనా

బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. దర్శకుడు మలినేని గోపీచంద్ మొదట ఈ సినిమా కథను కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రెడీ చేసినట్లు చెప్పారు.

అందుకోసం అనంతపురం రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్ సంఘటనల పై రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో దర్శకుడు కథ కోసం రాయలసీమలోని కొన్ని పాత లైబ్రరీలను కూడా సందర్శించాడు. అయితే.. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ ఎప్పటిలానే బాలయ్య మార్క్ కు తగ్గట్టుగా రొటీన్ గా ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎలా ఉండబోతుందంటే.. ఈ సినిమాల్లో కూడా బాలకృష్ణ రెండు పాత్రలు కనిపించబోతున్నారట.

అయితే.. ఫస్ట్ హాఫ్ లో మొత్తం యంగ్ క్యారెక్టర్ లో బాలయ్య బాబు కనిపించబోతున్నాడట. ఇక హీరోయిన్ తో ఉండే లవ్ స్టోరీ సన్నివేశాలు హైలెట్ అవుతాయట. ఆ తర్వాత ఒక ప్రమాదంతో కొడుకు గాయపడటంతో భార్య పిలుపు మేరకు సీనియర్ బాలకృష్ణ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడని… ఎంట్రీ తోనే గూస్ బంప్స్ వచ్చే విధంగా  దర్శకుడు హై వోల్టేజ్ సన్నివేశాలను తెర పైకి తీసుకువచ్చినట్లు సమాచారం. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాల తరహాలోనే ఈ సినిమా ఉంటుందట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి గోపీచంద్ మలినేని బాలయ్యను ఎలా ప్రజెంట్ చేస్తారో..? ఎంత వరకు మెప్పిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

Also Read : వీరయ్యతో పోటీకి సై అంటున్న బాలయ్య.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular