Thursday, April 18, 2024
HomeUncategorizedట్విట్టర్ లో బాలయ్య వస్తారా..?

ట్విట్టర్ లో బాలయ్య వస్తారా..?

నట సింహం నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో అంతగా ఉండరు. ఫేస్ బుక్ లో ఉన్నారేమో కానీ.. ట్విట్టర్ లో బాలయ్య లేరు. అయితే.. ఇటీవల కాలంలో బాలయ్య పేరు బాగా మారుమ్రోగుతుంది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాతో సోషల్ మీడియాలో బాలయ్యకు బాగా క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు బాలయ్య పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యేది. ఇప్పుడు అది లేదు.

అందుకే.. ట్విట్టర్ లో వస్తే బాలయ్య వేసే పొలిటికల్ పంచ్ లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనేది ఆయన అభిమానుల ఫీలింగ్. కానీ ఈ నందమూరి సీనియర్ హీరో బాలయ్య ఒప్పుకోలేదట. ట్విట్టర్ లోకి అడుగుపెట్టే ఆలోచన, ఆసక్తి లేవని క్లారిటీ ఇచ్చాడట. ప్రస్తుతం ఆయన పేరు మీద ఒక ఫేస్ బుక్ ఖాతా ఉంది. అధికారిక ఖాతానే. కానీ, ఒక ఏజెన్సీ ఆయన తరఫున పోస్టులు పెడుతుంది. ఆహా కోసం అన్ స్టాపబుల్ అంటూ చేస్తున్న టాక్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. సెకండ్ సీజన్ కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికైతే ట్విట్టర్ కు నో చెప్పారు. మరి.. ఫ్యూచర్ లో ట్విట్టర్ లో ఎంట్రీకి ఎస్ చెబుతారేమో చూడాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే..  బాలయ్య నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహరెడ్డి. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందిన వీరసింహారెడ్డి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇటీవల జనవరి 12న వీరసింహారెడ్డి చిత్రం రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 8న స్టార్ట్ చేయనున్నారు.

Also Read : ‘హిట్ 2’ గురించి బాలయ్య, మహేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్