Thursday, June 18, 2026
HomeTrending Newsసాయిధరమ్ తేజ్ కోసం.. ఎన్టీఆర్

సాయిధరమ్ తేజ్ కోసం.. ఎన్టీఆర్

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్.. ఇలా కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ సాధించాడు. ఆతర్వాత తిక్క, విన్నర్, జవాన్.. ఇలా వరుసగా ఫ్లాప్స్ కూడా చూశాడు. అప్పటి నుంచి కథల విషయంలో కేర్ తీసుకున్నాడు. చిత్రలహరి చిత్రం నుంచి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటరు, రిపబ్లిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే.. రిపబ్లిక్ మూవీ టైమ్ లో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గా కొత్త సినిమాను ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 15వ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ సస్పెన్స్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ ని డిసెంబర్ 7 న ఉదయం 11 గం. లకు రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ తెలిపింది.

ఈ టైటిల్ టీజర్ కి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నట్లు ఒక వీడియో బైట్ ద్వారా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. మొత్తంగా సాయి తేజ్ మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండడంతో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి సాయిధరమ్ తేజ్ 15వ చిత్రం పై అందరిలో ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యేలా బాగా ప్లాన్ చేశారు. మరి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular