Wednesday, June 26, 2024
Homeసినిమాబాలయ్య అఖండ విడుదల తేదీ ఖరారు?

బాలయ్య అఖండ విడుదల తేదీ ఖరారు?

Balayya Boyapati Akhanda Will Be Releasing on December 2nd :
నందమూరి నట సింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను అఖండ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

దసరాకి అఖండ వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. రాలేదు. ఆతర్వాత దీపావళికి అఖండ సినిమా విడుదల అని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు దీపావళికి కూడా అఖండ విడుదల కావడం లేదు. అయితే.. దీపావళికి అఖండ విడుదల తేదీ పై క్లారిటీ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అఖండ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ విడుదల తేదీని దీపావళికి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.

Must Read :‘లైగర్’ సెట్‌లో ‘అఖండ’ ప్రత్యక్షం

RELATED ARTICLES

Most Popular

న్యూస్