Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య నట ఉగ్రరూపం: అఖండ టైటిల్ సాంగ్

బాలయ్య నట ఉగ్రరూపం: అఖండ టైటిల్ సాంగ్

Balayya Boyapati Combination Akhanda Movie Title Song Released :

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న ‘అఖండ’ సినిమా టైటిల్ సాంగ్ దీపావళి కానుకగా విడుదలైంది. 53 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియో సాంగ్ అటు బాలయ్య అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంది.

‘భం అఖండా….భం భం అఖండా… రాగ జ్వాలవై పాడరా…దీనుల కళ్ళ నిండా…’ అంటూ ఉద్వేగభరితంగా సాగే ఈ పాటలో బాలయ్య హావభావాలు మైమరిపిస్తున్నాయి. బాలయ్య పోషిస్తోన్న అఘోరా పాత్రపైనే ఈ పాట సాగుతోంది. పూర్తి నిడివి సాంగ్ ను నవంబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో  హ్యాట్రిక్ చిత్రంగా ‘అఖండ’ రూపొందుతోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తుండగా నటి పూర్ణ కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ  చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

డిసెంబర్ 2న సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారంలోనే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Must Read : బాలయ్య అఖండ విడుదల తేదీ ఖరారు?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్