Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్ఆసీస్ ధాటికి బంగ్లా బోల్తా

ఆసీస్ ధాటికి బంగ్లా బోల్తా

ICC T20 Wc Australia Beat Bangladesh By 8 Wicket :

టి20 వరల్డ్ కప్ నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ 73 పరుగులకే చాప చుట్టేసింది. ఆడమ్ జంపా మరోసారి తన లెగ్ స్పిన్ మాయాజాలంతో సత్తా చాటి ఐదు వికెట్లతో రాణించాడు. మిచెల్ స్టార్క్, హాజెల్ వుడ్ చెరో రెండు, గ్లెన్ మ్యాక్ వెల్ ఒక వికెట్ తీసుకున్నారు. కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ పూర్తయింది. ఆసీస్ ఈ లక్ష్యాన్ని6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా వికెట్ల పతనం మొదటి ఓవర్ నుంచే ప్రారంభమైంది. స్టార్క్ బౌలింగ్ లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్ అయ్యాడు. మరుసటి ఓవర్లోనే వన్ డౌన్ బ్యాట్స్ మెన్ సౌమ్య సర్కార్ ఐదు పరుగులు చేసి హాజెల్ వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. షమీమ్ హుస్సేన్­-19; ఓపెనర్ మహమ్మద్ నయీం- 17; కెప్టెన్ మహ్మదుల్లా-16 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. నలుగురు(లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్. మహేది హసన్, షోరిఫుల్ హుస్సేన్) డకౌట్  కాగా, మరో ముగ్గురు… సౌమ్య సర్కార్-5; ముష్ఫిఖర్ రహీమ్-1; ముస్తాఫిజూర్ రహ్మాన్-4 సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

ఆస్ట్రేలియా ఓపెనర్లు పించ్, వార్నర్ ఐదు ఓవర్లలో 58  పరుగులు చేశారు. ఐదో ఓవర్ చివరి బంతికి టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ పించ్ బౌల్డ్ అయ్యాడు. పించ్ 20  బంతుల్లో 2 ఫోర్లు,  4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. వార్నర్ 14 బంతుల్లో మూడు ఫోర్లతో  18 పరుగులు చేసి ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ కేవలం ఐదు బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. విన్నింగ్ షాట్ సిక్సర్ తో ఆట ముగించాడు.

నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన  ఆడమ్  జంపా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

బంగ్లా ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేకపోయింది. ఆసీస్ ఇప్పటికి నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు విజయాలతో గ్రూప్ 1 లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Must Read :ఆస్ట్రేలియా భారతీయుడికి ఉన్నత పదవి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్