Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్సూపర్ 12: ఆస్ట్రేలియా శుభారంభం

సూపర్ 12: ఆస్ట్రేలియా శుభారంభం

ఐసిసి టి-20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యం స్వల్పమే అయినా ఆసీస్ ఆపసోపాలు పడుతూ లక్ష్యాన్ని సాధించింది.  అబుదాబీలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా బౌలర్లు పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. దీనితో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అల్దెన్ మార్ క్రమ్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులు చేశాడు. అదే జట్టులో అత్యధిక స్కోరు. చివర్లో రబడ 19 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్, ఆడమ్ జంపా చెరో తలా రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్ వెల్, కమ్మిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేసింది.

స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది, 38 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పింఛ్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్-14, మిచెల్ మార్ష్-11 పరుగులకే ఔటయ్యారు. ఈదశలో సీవ్ స్మిత్-35, మ్యాక్స్ వెల్-18 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. చివర్లో మార్కస్ స్టోనిస్-24; మాథ్యూ వాడే-15 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయంవైపు నడిపించారు. అయితే లక్ష్యం చిన్నదే అయినా ఆసీస్ చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. సౌతాఫ్రికా బౌలర్లలో నార్త్జ్ రెండు; రబడ, టబ్రైజ్, కేశవ్ మహారాజ్ తలా ఒక వికెట్ సాధించారు.

నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టిన హజెల్ వుడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్