Sunday, June 14, 2026
Homeసినిమాకర్నూలులో సంద‌డి చేస్తున్న‌ బాల‌య్య‌

కర్నూలులో సంద‌డి చేస్తున్న‌ బాల‌య్య‌

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ ‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular