delayed?: నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అఖండ అంచనాలకు మించి విజయం సాధించడంతో బాలయ్య తదుపరి చిత్రం పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే… క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్య నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ క్రేజీ, భారీ యాక్షన్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు.
సంక్రాంతి తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం మరింత ఆలస్యం కానుందని తెలిసింది. కారణం ఏంటంటే… బాలయ్య ఇటీవలే ఆహా కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుంచి ఫ్రీ అయ్యారు. అయితే… ఆయన పలువురికి కథలు వింటానని మాట ఇచ్చారట. ఇప్పుడు కథలు విని వాటి పై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత మలినేని గోపీచంద్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం.
అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్ కి కరోనా సోకింది. ఆమె కరోనా నుంచి బయటపడి షూటింగ్ రావడానికి కూడా టైమ్ పడుతుంది. అందుచేత బాలయ్య, మలినేని గోపీచంద్ మూవీ మరింత ఆలస్యం కానుందని టాక్ వినిపిస్తోంది.
Also Read : మలినేని సినిమాలో ఇద్దరు బాలయ్యలు