నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించాడు. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘిక, సైన్స్ ఫిక్ష‌న్‌… ఇలా ఏదీ వ‌ద‌ల్లేదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో 100 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య సెంచరీ తర్వాత మరింత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి అంటూ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో వస్తుంది.

అయితే.. ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఏంటంటే… తన దృష్టి.. చంఘీజ్ ఖాన్‌ పై ప‌డిందని… ఎప్ప‌టికైనా స‌రే.. ఛంఘీజ్ ఖాన్ సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు బాల‌య్య‌. అయితే దానికి టైమ్ రావాల‌న్నాడు. చ‌రిత్ర‌లో… ఛంఘీజ్ ఖాన్‌ కి ప్ర‌త్యేక స్థానం ఉంది. అత‌ను మంగోల్ సామ్రాజ్య వ్య‌వ‌స్థాప‌కుడు. చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సామ్రాజ్యంగా మంగోల్ సామ్రాజ్యాన్ని పేర్కొంటారు చ‌రిత్ర కారులు. ఆ సామ్రాజ్య స్థాప‌న కోసం చంఘీజ్ ఖాన్ ఏం చేశాడు? త‌న పోరాటం ఎలా కొన‌సాగించాడు? అనేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.

ఇప్పుడు బాల‌య్య దృష్టి ఈ సినిమా పై ప‌డింది. స‌రైన ద‌ర్శ‌కుడు దొరికితే.. బాల‌య్య క‌ల నెర‌వేరిన‌ట్టే. అయితే… ఇంత పెద్ద క‌థ‌ని, ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న‌చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించగలిగే.. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది బాల‌య్య అభీష్టం మేర‌కు ఉంటుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. మరి.. ఈ సినిమా తర్వాత ఎవరితో చేస్తారో..? ఏ తరహా మూవీ చేస్తారో..? ఈ ఛంఘీజ్ ఖాన్ మూవీ ఎప్పుడు సెట్ అవుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *