నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో వంద సినిమాలు పూర్తి చేసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే బాలయ్య మార్క్ యాక్షన్ కూడా ఉంటుదని సమాచారం.

అయితే.. బాలయ్య నెక్ట్స్ మూవీని ఎవరితో చేయనున్నారనేది అనౌన్స్ చేయలేదు కానీ.. బోయపాటితో బాలయ్య తదుపరి చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత బోయపాటి రామ్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ గ్యాప్ లో బాలయ్య మరో సినిమా చేయనున్నాడని టాక్ వచ్చింది. అది ఎవరితోనో కాదు.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందించిన బాబీతో అని ప్రచారం జరుగుతుంది. దీంతో బాలయ్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

తాజా వార్త ఏంటంటే.. బాలయ్య తదుపరి చిత్రం బోయపాటితోనే అని తెలిసింది. బోయపాటి రామ్ మూవీ కంప్లీట్ చేసి వచ్చే వరకు బాలయ్య ఆగుతానని చెప్పారట. ఈ సినిమా తర్వాతే బాబీతో సినిమా చేస్తానని చెప్పారట. గత రెండు రోజులుగా బాలయ్య, బోయపాటి మధ్య చర్చలు జరిగాయని.. వీరిద్దరి కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి. మరి.. ఈసారి చేసే సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *